YouTuber Nuisance : ORR పై యూట్యూబర్ మనీ హంటింగ్ వీడియో... మండిపడుతున్న నెటిజన్లు

by M.Rajitha |   ( Updated:2024-12-17 15:27:42.0  )
YouTuber Nuisance : ORR పై యూట్యూబర్ మనీ హంటింగ్ వీడియో... మండిపడుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(Hyderabad ORR)పై ఓ యూట్యూబర్ న్యూసెన్స్(YouTuber Nuisance) సృష్టించాడు. రింగ్ రోడ్ మధ్యలో నిలబడి మనీ హంటింగ్ వీడియో చేస్తూ వాహనదారులకు ఇబ్బంది కలిగించాడు. ఓఆర్ఆర్ పైన గల 9వ ఎగ్జిట్ వద్ద నిలబడి, తన చేతుల్లోని 20 వేల రూపాయల డబ్బును ఓఆర్ఆర్ పక్కన చెట్ల పొదల్లో పడేసాడు. ఎవరైనా వచ్చి ఆ డబ్బు తీసుకోవచ్చని ఆఫర్ విసిరాడు. ఆ వీడియోను యూట్యూబర్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. నెటిజన్లు ఈ ఘటనపై మండిపడుతున్నారు. 120కిమీల స్పీడ్ లిమిట్ ఉన్న రహదారిపై నిలబడి, అధిక స్పీడ్ తో వస్తున్న వాహనాల మధ్య యూట్యూబర్ వీడియోలతో హాల్ చల్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరి బాధ్యత అని మండిపడుతూ.. పోలీసులు దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story