మీ విధులతో పోలీస్ ప్రతిష్ట పెరుగుతుంది : సీపీ సీవీ ఆనంద్

by Aamani |
మీ విధులతో పోలీస్ ప్రతిష్ట పెరుగుతుంది : సీపీ సీవీ ఆనంద్
X

దిశ, సిటీ క్రైమ్ : ‘TRUTH ANY COST’ ఈ లైన్ ను స్పెషల్ బ్రాంచ్ అధికారులు కచ్చితంగా పాటించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం లో స్పెషల్ బ్రాంచ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహించడం పనిష్మెంట్ గా భావించొద్దని చెప్పారు. స్పెషల్ బ్రాంచ్ విభాగం హైదరాబాద్ పోలీసులకు కీలకమైంది. స్పెషల్ బ్రాంచ్ ప్రజలు, స్థానికులు, నాయకులతో కలిసి పోయి పని చేయాలని సూచించారు. స్థానిక పోలీస్ లను అలర్ట్ చేసే ప్రతి సమాచారాన్ని ఉన్నతాధికారులకు, స్థానిక ఇన్స్పెక్టర్, పోలీస్ అధికారులకు కు అందించాలన్నారు.

కొత్త వ్యక్తుల సంచారం, లాడ్జి లు,హోటల్స్ ఇంకా ఇతర రహస్య ప్రాంతాల్లో జరుగుతున్న కార్యకలాపాల పై నిఘా పెట్టాలన్నారు. నగరానికి సరిహద్దు దేశాలు, రాష్ట్రాల నుంచి వస్తుంటారు వారి వ్యవహారాల పై నిఘా పెట్టాలన్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పాస్పోర్ట్ వెరిఫికేషన్ లో నిజాయతీగా పనిచేయాలన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు మంచి గుర్తింపు తీసుకురావాలని సీపీ సీవీ ఆనంద్ కోరారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీసీపీ ఎస్. చైతన్య కుమార్, ఎస్పీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story