సినీ ఫక్కీలో యువకుడు కిడ్నాప్.. చిక్కుమూడి వీడేదెలా..?

by Nagaya |   ( Updated:2022-09-02 11:56:38.0  )
సినీ ఫక్కీలో యువకుడు కిడ్నాప్.. చిక్కుమూడి వీడేదెలా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో కిడ్నాప్ కలకలం సృష్టించింది. పీఎన్టీ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇంజనీరింగ్ చదువుతున్న సుబ్రహ్మణ్యం.. గురువారం రాత్రి ఇంటి బయట రోడ్డుపై ఉండగా.. బ్లాక్ కలర్ కారులో వచ్చిన నలుగురు యువకులు అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకుని పారిపోవడం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘటనపై వెంటనే సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా రెండు బృందాలుగా విడిపోయి యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా తమకు, తన కుమారుడికి ఎవరితోనే శతృత్వం లేదని.. తమకు ఎవరి మీద అనుమానం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కిడ్నాప్ కేసు చిక్కుమూడి పడినట్లయింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story