- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వాచ్ మెన్ గా పని చేస్తూ… బంగారు ఆభరణాలు చోరీ..
దిశ, జూబ్లీహిల్స్: వాచ్ మెన్ పని కోసం డబ్బున్న ఇంట్లో చేరి ఆపై ఎవరూ లేని సమయంలో బంగారు ఆభరణాలు లూటీ చేసిన సంఘటన జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం జులై 18న జూబ్లీహిల్స్ రోడ్ నెం.54 లో ఓ డబ్బున్న ఇంట్లో వాచ్ మెన్ గా చేరి ఎవరూ లేని సమయంలో బంగారు ఆభరణాలు చోరీ చేసిన నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి , రిమాండ్ కి తరలించారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి , డి ఐ మధుసుధన్ , క్రైమ్ ఎస్సై రాజశేఖర్ సమక్షంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. డి ఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.... “ఆంధ్రప్రదేశ్ కి చెందిన రేవు సురేష్ (30) , వాచ్ మెన్ గా పని చేస్తాడు. హఫీజ్ పేట్ లో నివాసిస్తుంటాడు. రేవు సురేష్ తో పాటు వాచ్ మెన్ గా పని చేసే అవిటి పల్లారావు (52) , టౌటి సుబ్బారావు (38) ముగ్గురు ఒకే వృత్తి ముగ్గురు జూబ్లీహిల్స్ లో వాచ్ మెన్ లుగా పనిచేస్తున్నారు.
వారి కుటుంబ అవసరాలకు డబ్బు కావాల్సి ముగ్గురు పథకం ప్రకారం దొంగతనం చేయాలనుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు రేవు సురేష్ తాను పని చేస్తున్న జూబ్లీహిల్స్ 54 లోని ప్లాట్ నెం. 1167 ఇంట్లో ఎవరూ లేని సమయంలో జులై 18వ తేదీన డైమండ్ రింగ్ లు , బంగారు ఆభరణాలు దాదాపు రూ. 12 లక్షల విలువైన వస్తువులతో ఉడాయించారు. ఆ చోరికి పాల్పడిన వస్తువులను వెంకటగిరి ప్రాంతంలో ఉండే ఓ బంగారు నగల వ్యాపారి కి అమ్మారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం నిందితులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.” నిందితుల వద్ద నుండి దాదాపు రూ. 5,97,000/- నగదు. నగల వ్యాపారి వద్ద నుండి రూ. 5 00,000/- విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.