- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా దినోత్సవం గిఫ్ట్... సిలిండర్ ధర పెంపు : ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎద్దేవా
దిశ, ముషీరాబాద్ : మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధాన మంత్రి మోడీ ఇచ్చిన కానుక ఈ సిలిండర్ ధరల పెంపా..? అని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను వ్యతిరేకిస్తూ ముషీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాంనగర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ కట్టెలతో వంట చేసి, సిలిండర్లతో రోడ్డు పై బైఠాయించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలను చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మోడీ అధికారంలోకి రాకముందు సిలిండర్ ధర 400 రూపాయలుంటే, అదే సిలిండరు ఇప్పుడు 1200 రూపాయలకు చేరుతుందని విమర్శించారు.
సిలిండర్ ధర కారణంగా ప్రజలకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయని, పెరుగుతున్న సిలిండర్ ధరలు, నిత్యావసర సరుకుల పెరుగుదల నేపథ్యంలో ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉందన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జయసింహ, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ, ముషీరాబాద్ నియోజకవర్గం వివిధ డివిజన్ల అధ్యక్షులు బల్ల శ్రీనివాస్ రెడ్డి, నర్సింగ్ ప్రసాద్, రాకేష్ కుమార్, వల్లాల శ్యామ్ యాదవ్, వై.శ్రీనివాస్, కార్యదర్శులు దామోదర్ రెడ్డి, సురేందర్, ఆకుల అరుణ్ కుమార్, పోతుల శ్రీకాంత్, సాయి కృష్ణ, ముషీరాబాద్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి, నాయకులు ప్రభాకర్, మారిశెట్టి నర్సింగ్ రావు, అజయ్ ముదిరాజ్, శోభ, సంపూర్ణ, నీలాదేవి, మార్గం అమర్ నేత, దోమల రాజు నేత, మధు, అబ్బు, ఖలీల్, మేరి, అనురాధ, లక్ష్మణ్ గౌడ్, రాజేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.