- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇక సిల్ట్ ఛాంబర్లు తప్పనిసరి..!
దిశ, సిటిబ్యూరో : ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో డ్రైనేజీ పైప్‌లైన్ల ద్వారా కరగని వ్యర్థాలు లేకుండా సాఫీగా పరుగెత్తించేందుకు జలమండలి శక్తియుక్తులు ఒడ్డుతోంది. బోర్డు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 90 రోజుల సీవరేజీ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మ్యాన్‌హోల్ టు మ్యాన్‌హోల్ డీ - సిల్టింగ్‌లో డ్రైనేజీ పైప్‌లైన్ల నుంచి బయటపడుతున్న కరగని వ్యర్థాలు మురుగు ప్రవాహానికి అడ్డుపడి అవి ఓవర్‌ఫ్లో అవుతున్నట్లు జలమండలి గుర్తించింది. మురుగు నీటి ఓవర్ ఫ్లోను నివారించేందుకు మురుగు నీటిలో కరగని వ్యర్థాలను ఎక్కడికక్కడే కట్టడి చేసేందుకు చర్యలకు ఉపక్రమిస్తోంది.
సిల్ట్ ఛాంబర్లు తప్పనిసరి..
మురుగునీరు అధికంగా ఉత్పన్నమయ్యే హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్, హాస్పిటల్స్, మాల్స్, బేకరీలు, బహుళ అంతస్తుల భవనాలతో పాటు నివాస సముదాయాల సీవరేజీ కనెక్షన్ల పై దృష్టి సారించింది. ఈ పద్ధతిలో మురుగు నీరంతా ముందుగా సిల్ట్ ఛాంబర్‌లో చేరి ఏవైనా ఘనపదార్థాలుంటే వడబోసి కేవలం మురుగు నీరు మాత్రమే డ్రైనేజీ పైప్‌లైన్‌లోకి కలుస్తుంది. దీంతో డ్రైనేజీలో మురుగు ప్రవాహానికి ఎలాంటి ఆటంకం ఉండదని బోర్డు భావిస్తోంది. ఇందుకోసం మురుగు అధికంగా ఉత్పన్నమయ్యే బహుళ అంతస్తులు, వాణిజ్య భవనాల సీవరేజీ కనెక్షన్లకు సిల్ట్ ఛాంబర్లు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్ చివరి నాటికి గడువు..
బహుళ అంతస్తు భవనాల వినియోగదారులు మురుగు కనెక్షన్లకు సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకోకుంటే కఠినంగా వ్యవహరించాలని జలమండలి యోచిస్తోంది. నగరంలో ఇప్పటికే సిల్ట్ ఛాంబర్లు లేని వాణిజ్య భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేయగా, మిగితా భవనాలకు సైతం నోటీసులు జారీ చేసే పనిలో నిమగ్నమైంది. భవన సముదాయాలకు ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి సీవరేజీ కనెక్షన్లకు సిల్ట్ చాంబర్లు నిర్మించుకునే విధంగా గడువు విధించాలని, అప్పటి వరకు సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకోకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.
సీవరెజీ పైపులైన్ల అప్‌గ్రేడ్..
నగరంలో గతంలో ఇండిపెండెంట్‌గా ఉన్న ఇళ్ల స్థానంలో పెద్దఎత్తున బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి అందుకు అనుగణంగా సీవరేజీ పైపు లైన్లు అప్ గ్రేడ్ చేయకుండా పాతవాటినే ఉపయోగిస్తున్నారు. దీంతో ఆ పైపులైన్ల పై ఒత్తిడి పెరిగి ఓవర్ ఫ్లో, సీవరేజీ లీకేజీ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి పాత సీవరెజీ పైపు లైన్‌ల స్థానంలో పైపు సైజును అప్‌గ్రేడ్ చేసుకోవాలని జలమండలి సూచిస్తోంది. ఇలాంటి వాటిని గుర్తించి అప్ గ్రేడ్ చేసుకోవాలని నోటీసులు జారీ చేస్తోంది. ఇంట్లో ఆహార పదార్థాలు సీవరెజీ లైన్‌లో కలిసి మురుగు సమస్యలు తలెత్తకుండా నాలుగు అంతకంటే ఎక్కువ ఇళ్లకు కలిపి ఒక కమ్యూనిటీ సిల్ట్ ఛాంబర్ నిర్మిస్తే ఎప్పటికప్పుడు శుభ్రం చేసే వీలుంటుందని, దీంతో సీవరెజీ లైన్ల నిర్వహణ సులభతరం అవుతుందని జలమండలి యోచిస్తోంది.