- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
update: మియాపూర్ లో యువకుడు దారుణ హత్య..
దిశ, మియాపూర్: మియాపూర్ పాత బస్టాప్ సమీపంలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ తిరుపతి రావు తెలిపిన వివరాల ప్రకారం.. లకడారం పఠాన్ చెరువుకు చెందిన ఏర్రోల్ల ప్రవీణ్ (26), చెత్త ఏరుకొని వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి 10గంటలకు మియాపూర్ బస్టాప్ కు సమీపంలో ఉన్న వైన్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తితో కలిసి మద్యం తాగాడు. కాగా ఇద్దరి మధ్య డబ్బుల విషయమై గొడవ జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తి ప్రవీణ్ ను బండరాయితో తలపై గట్టిగా మోదడంతో అక్కడికక్కడే మరణించాడు. గురువారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శవాన్ని గాంధీ ఆసుపత్రికి తలించారు. కాగా ప్రవీణ్ గతంలో యాక్సిడెంట్ గురై తలకు దెబ్బ తగలడంతో కొంత మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మద్యానికి బానిస అయినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.