- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రిజిస్ట్రేషన్లను ఆపిన టైపింగ్ మిస్టేక్..!
దిశ, పేట్ బషీరాబాద్: కుత్బుల్లాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో వక్ఫ్ బోర్డు భూములుగా పేర్కొంటూ ఉన్న పలు సర్వే నెంబర్లలపై క్లారిటీ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేవలం టైపింగ్ చేయడంలో తప్పు దొర్లడంతోనే ఈ విధమైన పొరపాటు జరిగిందని కోరుతూ రిజిస్ట్రేషన్స్ స్టాంప్స్ కమిషనర్‌కు లేఖ రాశా రు. దీంతో కుత్బుల్లాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెం. 168 కాకుండా కేవలం రెండు సర్వే నెం. మాత్రమే నిషేధం ఉన్నట్లు తెలుస్తుంది.
కుత్బుల్లాపూర్ పరిధిలోనే..
కుత్బుల్లాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెం.58 నుంచి 175 వరకు, సర్వే నెం. 177 నుంచి సర్వే నెం. 256 వరకు ఉన్న కేవలం 41 గుంటల భూమి వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తుందంటూ ఆగస్ట్ 27న ఉత్తర్వులు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 13 నుంచి రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్రంలో వివిధ సర్వే నెంబర్లతో పాటుగా అత్యధికంగా కుత్బుల్లాపూర్ గ్రామ రెవె న్యూ పరిధిలో సర్వే నెం. 165లో రిజిస్ట్రేషన్లు ఆపేశారు.
ఆగస్ట్ 27న ఉత్తర్వులు..
నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో 302.22 ఎకరాల భూమి వక్ఫ్‌బోర్డు భూమిగా పేర్కొంటూ ఆగస్ట్ 27న ఉత్తర్వు లు జారీ చేశారు. ఇదే తేదీతో రిజిస్ట్రేషన్లు వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేశారు. ఈ ఉత్తర్వులు కాపీ 9 సెప్టెంబర్, 2024 నాడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కార్యాలయానికి రావడం.. అనంతరం 13న కమిషనర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఆదేశాలతో రిజిస్ట్రేషన్లు ఆపేయాల్సిందిగా అన్ని ఎస్ఆర్‌వో కార్యాలయాలకు ఉత్తర్వులను పంపించారు. దీంతో సెప్టెంబర్ 13 నుంచి విజేత జాబితాలో పేర్కొంటూ బోర్డు పరిధిలోకి వచ్చే భూములుగా చెబుతున్న ఆయా సర్వే నెంబర్లలో రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ నిలిచిపోయింది.
పోరాడిన వక్ఫ్ బోర్డు బాధితులు
అత్యధికంగా కుత్బుల్లాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెం. 165లో రిజిస్ట్రేషన్స్ ఆగిపోవడం తో బీజేపీ నేత ఆకుల సతీష్ కు త్బుల్లాపూర్ ఎస్ఆర్ఓకు వినతిపత్రం ఇచ్చారు. రోజులు గడిచి నా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల 3న వక్ఫ్ బోర్డు బాధిత జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేసేందుకు పూనుకున్నారు. పోలీసుల అనుమతులు లేకపోవడంతో దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి అధికారుల జాప్యానికి నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. 17న వక్ఫ్ బోర్డు బాధిత జేఏసీ ఆధ్వర్యంలో పోలీసులు అనుమతులతో పాదయాత్ర చే సేందుకు సిద్ధమయ్యామని సతీష్ పేర్కొన్నారు. బాధితుల విన్నపా న్ని ఆలకించి తప్పు సవరించుకున్నందుకు ఆయా శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలి పారు
‘అండ్’కు బదులు ‘టు’ టైప్ అయ్యిందంట..
ఒక చిన్న పదం తప్పుగా నమోదవడంతో వందలాది మంది ఆందోళనకు గురవడమే కాకుండా రిజిస్ట్రేషన్ శాఖ లక్షల్లో ఆదాయాన్ని కోల్పోయింది. వక్ఫ్ ఆస్తుల వివరాలను పేర్కొంటూ రూపొందించిన నివేదికలో కుత్బుల్లాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 58 నుంచి సర్వే నెం. 226 వరకు 58 and 226 అని టైప్ చేయబోయి పొరపాటున 58 to 226గా నమోదైందని బోర్డు సీఈ ఓ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ కమిషనర్ కు లేఖ రాశారు.