పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరికి జైలు శిక్ష...

by Disha Web Desk 11 |
పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరికి జైలు శిక్ష...
X

దిశ, చంపాపేట్ : పోలీసుల విధులకు ఆటంకం కలిగించి దుర్భాషలాడిన కేసులో ఇద్దరికి నాంపల్లిలోని 7వ స్పెషల్ మెట్రోపాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ ఎస్.సత్యనారాయణ శుక్రవారం మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఇన్స్పెక్టర్ జి.శేఖర్ రెడ్డి, ఎస్సె లింగరాజులు తెలిపిన వివరాల ప్రకారం... కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజా బాబానగర్ ప్రాంతంలో కానిస్టేబుల్ కె. అంజనేయులు, హోంగార్డు భాజాపాషాలు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గస్తీ నిర్వహిస్తున్నారు.

కాగా అదే సమయంలో హఫీజాబాబానగర్ సి-బ్లాక్ ప్రాంతానికి చెందిన మహ్మద్ మాజిద్ (23), జూబేర్ పాషా (26)లు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీలు చేస్తుండగా విధులకు ఆటంకం కలిగిస్తూ దుర్భాషలాడారు. దీంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ-పెట్టి కేసు నమోదు చేసుకొని, శుక్రవారం నాంపల్లిలోని 7వ స్పెషల్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరచగా... పూర్వ పరాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ ఎస్.సత్యనారాయణ ఇద్దరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారు.

Next Story