పవన్ కల్యాణ్ గురించి అసలు నిజాలు బయటపెట్టిన సమంత.. వీడియో వైరల్

by Disha Web Desk 7 |
పవన్ కల్యాణ్ గురించి అసలు నిజాలు బయటపెట్టిన సమంత.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలిసిందే. ప్రస్తుతం మయోసైటీస్ నుంచి కోలుకుంటున్న ఈమె.. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. హెల్త్‌కు సంబంధించిన పలు వీడయోలను అభిమానులతో పంచుకుంటోంది. అంతే కాకుండా ఈ మధ్య గ్లామర్ డోస్ మరింత పెంచేసిన ఈ అమ్మడు ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్‌తో దర్శనమిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టకునే ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా సమంత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

బుల్లితెర మోస్ట్ బ్యాచురల్ ప్రదీప్ మాచిరాజు యాంకర్‌గా వ్యవహరించిన షో ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’. ఆ షోకు బ్యూటీ సమంత హాజరైంది. ఈ క్రమంలోనే స్క్రీన్‌పై పవన్ కల్యాణ్ ఉన్న పిక్ చూపించాడు ప్రదీప్. ఆ పిక్‌లో పవన్ కల్యాన్ నిలబడి ఉండగా.. సమంత కింద కూర్చుని ఉంది. ఆ పిక్ చూడగానే సమంత ‘మా గురువు గారు ఆయన. ఆయన హీరోగా కాకుండా వేరే ప్రోఫిషన్ అంటే గురువు. అంటే స్వామిజీగా పవన్ కల్యాణ్ సెట్ అవుతారు. అంతే కాకుండా.. మనం ఎవరైనా తిడితే ఏంటీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటాము. ఆయన అలా కాదు.. ఏంటీ మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటారు. కోపంలో కూడా గౌరవంగా తిడతారు’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. అయితే.. ఇది ‘అత్తారింటికి దారేది’ సినిమా టైంలో చేసిన ఇంటర్వ్యూ కాగా.. మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చి వైరల్ అవుతుంది. దీనిపై ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Next Story

Most Viewed