బ్రహ్మరాక్షసుల నుంచి విముక్తి కల్పిస్తా

by Disha Web Desk 15 |
బ్రహ్మరాక్షసుల నుంచి విముక్తి కల్పిస్తా
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. 45 ఏండ్లుగా మామ, అల్లుడు శనిలాగా, పాపాల భైరవుని లాగా పట్టి పిడిస్తున్నారన్నారు. బ్రహ్మరాక్షసుల నుంచి విముక్తి కలిగించేందుకు సిద్దిపేటకు వచ్చినట్లు స్ఫష్టం చేశారు. మల్లన్నసాగర్ లో భూములు గుంజుకొని అక్రమ కేసులు పెట్టిన వాళ్లు...రంగనాయక సాగర్ లో భూములు గుంజుకొని ఫాంహౌస్ లు కట్లుకున్న వాళ్లు కావాలో ఆలోచన చేయాలన్నారు. సిద్దిపేటలో దొరల రాజ్యం నడుస్తోందన్నారు. కౌన్సిలర్, సర్పంచ్, ఎమ్మెల్యేలకు పోటీ చేస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన దొరల దౌర్జన్యాలను మీ అన్న రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే బద్దులు కొట్టాలన్నారు. సిద్దిపేట గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరక పోతే బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే మెదక్ పార్లమెంట్ లో

కాంగ్రెస్ అభ్యర్థి, బడుగు బలహీన వర్గాల బిడ్డ నీలం మధు లక్షమెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక రావు..సిద్దిపేట రావు పొద్దున రెండు పార్టీలు..రాత్రి ఒక్కటే పార్టీ అన్నారు. సోనియాగాంధీ కాజీపేట కోచ్ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్ కారిడార్, ఐఐటీ, మెదక్ కు ఐఏఎం ఇస్తే..ప్రధాని నరేంద్ర మోడీ వాటిని కాలగర్బంలో కలిపి గాడిద గుడ్డు ఇచ్చారని మండిపడ్డారు. నీలం మధును గెలిపిస్తే ముదిరాజ్ లకు రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం కలిపిస్తా అన్నారు. అదే విధంగా ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ ఏలో చేర్చే బాధ్యత నీలం మధు తీసుకుంటాడన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్నారు. కొమురవెల్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు 15న రైతులను రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని పునరుద్ఘాటించారు. హరీష్ రావు రాజీనామా రాసిపెట్టుకో...రుణమాఫీ చేసిన తర్వాత సిద్దిపేట చౌరస్తాలో లక్షమందితో సమావేశం నిర్వహిస్తా అన్నారు. సిద్దిపేట శనీశ్వర్ రావును పాతాలానికి తొక్కే బాధ్యత తీసుకొని సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా అన్నారు. అద్దంకి దయాకర్ కు పెద్ద పదవి ఇస్తా అన్నారు. నాడు ఇందిరమ్మ గెలిచిన గడ్డపై బడుగు బలహీన వర్గాల బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed