ప్రతి పౌరుడికి లబ్ధి చేకూరుస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

by GSrikanth |
congress leader duddilla sridhar babu
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి లబ్ధి చేకూర్చేలా తమ కార్యక్రమాలు ఉంటాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షోను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడిదారులు, నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. సులభతర వాణిజ్య విధానానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. తాము దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నిర్మాణ రంగంలో హరిత భవనాలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు. హరిత భవనాల గురించి కొనుగోలుదారులకు నిర్మాణ సంస్థలు అవగాహన కల్పించాలని సూచించారు. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వీటి నిర్మాణం ప్రారంభమైంది. ప్లాస్టిక్ వినియోగంపై కేంద్రంలోని నాటి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని నాటి కాంగ్రెస్ సర్కార్ కఠిన చట్టాలను తీసుకొచ్చిందని గుర్తుచేశారు. గతంలో తాను పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఆకస్మిక తనిఖీలు చేశాననీ శ్రీధర్ బాబు గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed