ఎండకాలంలో పెరుగుతున్న శృంగార కోరికలు.. కారణం ఏమిటంటే?

by Jakkula Samataha |   ( Updated:2024-05-17 13:57:39.0  )
ఎండకాలంలో పెరుగుతున్న శృంగార కోరికలు.. కారణం ఏమిటంటే?
X

దిశ, ఫీచర్స్ : ఎండకాలం శృంగార కోరికలు అధికంగా పెరుగుతాయి నిజమేనా అంటే అవును అనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వేసవి కాలం అనేది మైండ్‌ని రిలాక్స్ చేస్తుందంట. అంతే కాకుండా సూర్యకాంతి అనేది లైంగిక కార్యకలాపాలను పెంచుతోందంట. లైంగిక కోరికలు పెరగాలంటే విటమిన్ డి అనేది ఎక్కువగా ఉండాలి. అయితే ఈ వేసవి కాలంలో సూర్యర్శి వలన విటమిన్ డి అనేది పెరుగుతోంది. దీని కారణంగా స్త్రీ, పురుషుల్లో మానసిక స్థితి బాగుండి, సెరిటోన్ అనే హార్మోన్ పెరుగుతోంది. ఇది మనలో నూతనోత్సాహాన్ని కలిగిస్తుంది. అంతే కాకుండా ఈ హార్మోన్ పెరగడం వలన శృంగార కోరికలు అనేవి పెరుగుతాయంట. దీంతో శృంగారాన్ని చేయడానికి ఈ సీజన్‌లో కపుల్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారంట.

అలాగే ఈ సీజన్‌లో చెమట అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీని వలన మానసికంగా ధృఢంగా ఉంటారంట. వర్క్ అవుట్ చేసే వారిలో శృంగార కోరికలు అధికంగా ఉంటాయి. అయితే ఇధి మానసిక స్థితిని మెరుగు పరుస్తోంది. దీని వలన లైంగిక కోరికలు అనేవి పెరుగుతాయంట. అంతే కాకుండా సమ్మర్‌లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపుతుంటారు. అయితే ఇది కూడా లైంగిక కోరికలు పెరగడానికి కారణం అవుతుందంట. భాగస్వాముల మధ్య ఆకర్షణ పెరిగి ఇది లైంగిక కోరికలను పెంచుతోంది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చాలా మంది కపుల్స్ సమ్మర్‌లో ఎక్కువగా తమ భాగస్వామితో గడపడానికి ఆసక్తి చూపుతారంట. దీంతో లైంగిక కోరికలు కూడా పెరిగిపోతాయి అంటున్నారు.

Read More..

మీ భాగస్వామి మీతో ఇలా ప్రవర్తిస్తందా.. అయితే విడాకులు ఖాయం!

Advertisement

Next Story