పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న మోదీ రిజర్వేషన్‌లు తీసేసారా..? : ఈటల

by Disha Web Desk 23 |
పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న మోదీ రిజర్వేషన్‌లు తీసేసారా..? : ఈటల
X

దిశ, మేడ్చల్ బ్యూరో : కేసీఆర్ నాయకులను ప్రలోభ పెట్టడం, వారి అనుభవాలకు వెల కట్టడం, బెదిరింపులకు పాల్పడడం, వంటి చర్యల వల్ల ప్రజాక్షేత్రంలో పలచబడిపోయిన సంగతి మనకు తెలిసిందేనని, నేడు రేవంత్ రెడ్డి కూడా అదే పద్దతి పాటిస్తున్నాడని మల్కాజ్ గిరి లోక్ సభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. కానీ కేసీఆర్, రేవంత్ రెడ్డిల పాచికలు పారవు అని, ఓట్లు వేసి గెలిపించేది ప్రజలేనన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారని మండి పడ్డారు. మళ్లీ ప్రధాని తప్పకుండా నరేంద్రమోదీ యే అవుతారని ఖాయమైందన్నారు.మోదీ వస్తే రిజర్వేషన్లు ఉండవని విపక్షాలు తప్పుడు ప్రచారం చేయడాన్ని దిక్కుమాలిన చర్యగా ఈటల అభివర్ణించారు. పదేళ్ల పాటు ప్రధాని గా ఉన్న మోదీ రిజర్వేషన్లు తీసేసారా.? అని ప్రశ్నించారు. నిమ్న జాతులకు, వర్గాలకు రిజర్వేషన్లు ఎప్పటికీ ఉంటాయని ఈటల హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రజలు నిజం తెలుసుకోవాలని, అబద్దపు ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.పీర్జాదిగూడలో నిర్వహించిన కురుమ ఆత్మీయ సమ్మేళనంలో గురువారం ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజక వర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఏనాడూ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని,. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడన్నారు.నేను తెలంగాణ మట్టి బిడ్డను. నన్ను కొందరు నువ్వెక్కడ నుంచి వచ్చావని అడుగుతున్నారు. 14 ఏళ్లుగా ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం ముగ్గురు ముఖ్యమంత్రులతో కొట్లాడినా. రాజశేఖర్ రెడ్డి, రోశయ్యలతో పాటు మంత్రిగా ఉన్న కాలంలో కూడా కేసీఆర్‌తో కొన్ని సమస్యలపై కొట్లాడవలసి వచ్చిందని తెలిపారు.చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు, డబ్బులతో వార్తలు రాయించుకునే నాయకులను నిలువరించగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉందన్నారు.

నేను ఎక్కడ తిరిగినా ప్రజలు ఆదరిస్తున్నారు. బిడ్డ నువ్వు ఎండల్లో తిరగకు. నిన్ను గెలిపించుకునే బాధ్యత మదని భరోసా ఇస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారునిగా నన్ను గుర్తిస్తున్నారు. నీకు అన్యాయం జరిగిందని బాధపడుతున్నారు. నువ్వు పార్లమెంటుకు ఖచ్చితంగా పోతావని హామీ ఇస్తున్నారు.మల్కాజ్‌గిరి పార్లమెంట్ బాగుపడాలంటే ఐటీ పరిశ్రమ, రైల్వేలైన్లు, ఇండస్ట్రియల్ కారిడార్ వంటివన్నీ రావాలని నేను అన్ని రకాలుగా ప్రయత్నిస్తానని మాట ఇస్తున్నానని ఈటల అన్నారు.

సీఎంవి తగని మాటలు..

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తగని మాటలు మాట్లాడుతున్నాడు. మానవబాంబు నవుతా, పేగులు మెళ్లో వేసుకుంటా, తొక్కి నారా తీస్తా అంటూ చెత్త మాటలు మాట్లాడుతున్నాడు. ప్రజలు నీకు అధికారం ఎందుకిచ్చారు. ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం పెన్షన్లపై పెడతానన్నాడు, పెట్టలేదని ఈటల మండిపడ్డారు. జీరో కరెంటు బిల్లు కూడా రావడం లేదని. కేసీఆర్ చిప్ప చేతికి ఇచ్చాడని ఈ ముఖ్యమంత్రి ప్రజలకు చెప్తున్నాడని, అంటే ఖజానా ఖాళీ అయ్యిందని, తాను ప్రజలకేమీ చెయ్యలేనని అంగీకరించినట్టేనన్నారు.కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ పార్టీల వారు ఓటర్లను డబ్బు, మద్యంతో ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈటల రాజేందర్ ఒక బ్రాండ్. డబ్బులిచ్చి, మద్యం ఇచ్చి గెలవడని స్పష్టంచేశారు.మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, డాక్టర్ ఎస్.మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed