KTR : చెక్కుల పంపిణీకి పోలీసుల పహారాపై కేటీఆర్ సెటైర్లు

by Ramesh N |
KTR : చెక్కుల పంపిణీకి పోలీసుల పహారాపై కేటీఆర్ సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలోని 13 గ్రామాల్లో శనివారం పోలీసుల పహారా మధ్య ప్రభుత్వం చెక్కుల పంపిణీ చేసింది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమ్శర్శలు చేశారు. చారాణ కోడికి బారాణ మసాలా అంటూ సెటైర్లు వేశారు. 13 గ్రామాలలో 26 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి 25 వాహనాలు,100 మంది పోలీసులతో భద్రతనా అని ప్రశ్నించారు. అసలు పంచిన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కుల విలువెంత అని నిలదీశారు.

25 వాహనాలు, 100 పోలీసుల జీతభత్యాల ఖర్చెంత ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడమే చట్టవిరుద్ధమని తెలిపారు. పైగా పోలీసు (Police) బందోబస్తు పెట్టి మరీ పంపిణీ చేయించడం రాజ్యాంగ విరుద్దమని వెల్లడించారు. హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండగా ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్ బాబుతో చెక్కుల పంపిణీ చేయించడం సిగ్గుచేటని విమర్శించారు.

Advertisement

Next Story