టీటీడీ నూతన సంవత్సరం,వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు

by Kalyani |
టీటీడీ నూతన సంవత్సరం,వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు
X

దిశ, హిమాయత్ నగర్ : హిమాయత్ నగర్ లోని బాలాజీ భవన్, తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతన సంవత్సరాన్ని, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా విస్తృతమైన ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ తెలిపింది. ఈ మేరకు సోమవారం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీటీడీ, ఏఈఓ రమేష్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస ప్రభు, హిందూ ధర్మ ప్రచార పరిష్ ఏఈఓ సత్యనారాయణ లు మాట్లాడుతూ.. నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు దేవాలయంకు రావడం జరుగుతున్నదని, అలాగే ఈ ఏడాది కూడా వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

నూతన సంవత్సరం 2025 జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు దేవాలయంలో శ్రీవారికి తిరుప్పలిడ్చి, తిరుప్పావై సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు భక్తులు శ్రీవారి దర్శనం, 7 గంటల నుంచి 8 వరకు ఉత్తరాషాడ అభిషేకం 30 (ఏకాంత సేవ), మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వదర్శనం, రాత్రికి శుద్ధి, ఏకాంత సేవ కొనసాగుతాయని వివరించారు. 10న వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారి దర్శనం, 11న కూడా అలాగే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 10వ తేదీ తెల్లవారు ఝామున 12.05 నుంచి స్వామివారికి తిరువ్పవైలిడ్చి (ఏకాంతం) అనంతరం తిరువ్పవై సేవ కలం, అభిషేకం, శుద్ధి, అలంకారం, తోమాల సేవలు జరుగుతాయని, శ్రీవారి సర్వదర్శనం ఉత్తర ద్వారం ద్వారా దర్శనం, రాత్రికి శుద్ధి, ఏకాంత సేవ జరుగుతాయని వారు తెలిపారు.

భక్తుల కోసం బాదం పాలు, లడ్డూ ప్రసాదం, మంచి నీరు, అన్నప్రసాద వితరణ ఉంటుందని పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని, శ్రీవారి సేవకులు, ఉద్యోగులు సేవలు అందిస్తారని, భక్తులు కూడా పూర్తిగా సహకరించి శ్రీవారి కృపకు పాత్రులు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ధర్మ ప్రచార పరిషత్ కూడా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమాలన్ని జూబ్లీహిల్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాయంలో కూడా జరుగుతాయని వారు తెలిపారు. ఈ సమావేశంలో టీటీడీ ఉద్యోగులు హరికృష్ణ, మణికంఠ, లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story