Tresa : భూ భారతి-2024 ఆర్వోఆర్ చట్టానికి సంపూర్ణ మద్దతు : ట్రెసా

by Bhoopathi Nagaiah |
Tresa : భూ భారతి-2024 ఆర్వోఆర్ చట్టానికి సంపూర్ణ మద్దతు : ట్రెసా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి-2024 ఆర్వోఆర్ చట్టానికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వంగా రవీందర్ రెడ్డి, కే గౌతమ్ కుమార్‌లు ప్రకటించారు. చట్టం అమలులో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. గురువారం నూతన సంవత్సరం సందర్భంగా ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గం సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా రెవెన్యూ వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నికల బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని, జీఓ 317 వల్ల నష్టపోయిన ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణ రైతాంగ భూ యాజమాన్య హక్కుల పరిరక్షణ లక్ష్యంతో తీసుకొచ్చిన నూతన భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని సీఎం చెప్పినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షులు దేశ్యా నాయక్, నాగమణి, జాయింట్ సెక్రెటరీ డి.వాణిరెడ్డి, నిజమాబాద్ జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గంగాధర్, కార్యదర్శి కిరణ్, బొమ్మ రాములు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed