AP Volunteers:ఏపీ ప్రభుత్వానికి వాలంటీర్లు సంచలన డిమాండ్..!

by Jakkula Mamatha |
AP Volunteers:ఏపీ ప్రభుత్వానికి వాలంటీర్లు సంచలన డిమాండ్..!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి(AP Government) వాలంటీర్లు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ వాలంటీర్లు(Volunteers) నిరసనకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత(Job security) కల్పించాలని డిమాండ్ చేస్తూ వాలంటీర్లు మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి. ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా నేడు(గురువారం) గ్రామ, వార్డు సచివాలయం అడ్మిన్ లకు వాలంటీర్లు(Volunteers) వినతి పత్రాలు అందజేసినట్లు సమాచారం. ఈ క్రమంలో రేపు(జనవరి 03) జిల్లా కేంద్రాల్లో(District Centers) మోకాళ్ల మీద కూర్చొని భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అధికారంలోకి వస్తే రూ.10 వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రకటించారని గుర్తుచేశారు. కూటమి నేతలు నమ్మించి మోసం చేశారని వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 04న బ్యాక్ టు వాక్ పేరుతో వాలంటీర్లు వెనక్కి నడుస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed