- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ షాపులను తొలగించాల్సిందే…: రీజినల్ మేనేజర్ ధర్మ
దిశ, మానోపాడు(అలంపూర్ ) : ఆర్టీసీ స్థలంలో అనుమతులు లేకుండా నడుపుతున్న ఆ షాపులను తొలగించాల్సిందే నని ఉమ్మడి జిల్లా రీజినల్ మేనేజర్ ధర్మ అన్నారు. గురువారం మానవపాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ ప్రాంగణాన్ని మరోసారి పరిశీలించారు. ఆర్టీసీ స్థలంలో అనుమతులు తీసుకుని డీడీలు చెల్లించిన షాపులు మాత్రమే ఉంటాయని, మిగతా షాపులను వెనివెంటనే తొలగించాలని హెచ్చరించారు. మూడు రోజుల పాటు గడువు ఇవ్వాలని షాపులో యజమానులు కోరడంతో ఈ నెల ఆరవ తేదీ వరకు చివరి అవకాశం ఇస్తున్నామని, ఆ లోపు డీడీలు చెల్లించి ఆర్టీసీ యాజమాన్యానికి సహకరిస్తే మీ షాపులు ఉంటాయని, లేదంటే జెసీబీ సహాయంతో వాటిని తొలగిస్తామని హెచ్చరించారు, ఆర్టీసీ స్థలం చుట్టూ కాంపౌండ్ నిర్మాణం చేయుటకు కూడా ఎలాంటి ఇబ్బందులకు తలెత్తకుండా షాపు నిర్వాహకులు సహకరించాలని కోరారు, బస్సులే గ్రామానికి రానప్పుడు ఆర్టీసీ ప్రాంగణం అభివృద్ధి ఎలా జరుగుతుందని, కనీస సౌకర్యాలు లేని ప్రాంగణంగా మారినప్పుడు మీరందరూ ఎక్కడికి పోయారని అధికారులను గ్రామస్తులు నిలదీశారు.
ఒక్కొక్క షాప్ నుండి రూ.2000 వరకు అద్దె వసూలు చేయుటకు నోటీసులు జారీ చేయడం ఎంతవరకు న్యాయమని, ఆ డబ్బుతో ఆర్టీసీ అభివృద్ధికి సహకరిస్తారా.. లేదని విషయం మీరే చెప్పాలని గ్రామస్తులు మండిపడ్డారు. మహిళలు ఆర్టీసీ ప్రాంగణానికి వస్తే కనీస సౌకర్యాలు లేని విధంగా ఆర్టీసీ ప్రాంగణం ఇబ్బందికరంగా మారిందని, టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్టీసీ యాజమాన్యానికి గ్రామం నుండి ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని, మీరు కూడా బస్సులు నడిపే విధంగా సహకరించాలని గ్రామస్తులు తెలిపారు. ఎస్సై చంద్రకాంత్, ఎంపీడీవో భాస్కర్ కూడా ఆర్టీసీ ప్రాంగణంలో ఉన్న షాప్ లో యజమానులతో మాట్లాడారు. గ్రామ అభివృద్ధితో పాటు ఆర్టీసీ అభివృద్ధికి గ్రామస్తుల సహకరించాలని, అనుమతులు తీసుకుంటే ఏ షాపును కూడా తొలగించమని తెలిపారు.