రైలు పట్టాల పక్కన గ్యాస్ సిలిండర్.. తప్పిన పెను ప్రమాదం

by Mahesh |
రైలు పట్టాల పక్కన గ్యాస్ సిలిండర్.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో కొందరు దుర్మార్గులు.. రైల్వే లైన్లను టార్గెట్ గా చేసుకుని కుట్రలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా.. రైలు పట్టాల(Railway tracks)పై వివిధ రకాల వస్తువులను ఉంచుతూ ప్రమాదాలు(accidents) జరిగేల ప్రణాళికలు(Plans) సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగా ఎవరు లేని ప్రదేశాల్లో రైలు పట్టాలపై పెద్ద రాళ్లను, ఇనుప రాడ్లను, గ్యాస్ సిలిండర్లను, సిమెంట్ బాక్సులను పెడుతున్నారు. లోకో పైలెట్లు అప్రమత్తంగా ఉంటుండడంతో పెను ప్రమాదాలు జరగకుండా అడ్డుకొగలిగారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే మరోకటి గురువారం కాన్పూర్‌(Kanpur)లోని బరాజ్‌పూర్ రైల్వే స్టేషన్(Barajpur Railway Station) సమీపంలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు.. రైల్వే పట్టాల(Railway tracks) పక్కన ఐదు కిలోల గ్యాస్ సిలిండర్ (Gas cylinder)ను పెట్టి వెళ్లిపోయారు. కాగా ఇది గమనించిన ఓ స్థానికుడు వెంటనే ఆ సిలిండర్ ను అక్కడి నుంచి తీసేసి.. స్థానిక పోలీసులకు, రైల్వే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జిఆర్‌పి), యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే సమాచారం ఇచ్చిన యువకుడిని వివరాలు అడిగి తెలుసుకొని.. సమీపంలోని సీసీటీవీలను కూడా పరిశీలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed