ఫలక్‌నుమలో దారుణం..కత్తులతో పొడిచి వ్యక్తి దారుణ హత్య

by Mahesh |
ఫలక్‌నుమలో దారుణం..కత్తులతో పొడిచి వ్యక్తి దారుణ హత్య
X

దిశ, చార్మినార్: పాతబస్తీ ఫలక్ నుమ‌లో దారుణం చోటు చేసుకుంది. కోపంగా చూస్తున్నాడనే నెపంతో స్క్రాబ్ వ్యాపారిని కత్తులతో హతమార్చిన ఘటన పాతబస్తీ ఫలక్నుమ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి తీవ్ర కలకలం రేపుతోంది. ఫలక్‌నుమ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫాతిమానగర్‌కు చెందిన సాధిక్ (37)కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గతంలో సాధిక్‌తో అదే ప్రాంతా నికి చెందిన మరో వ్యక్తితో విబేధాలు ఉన్నాయి. కోపంతో చూస్తున్నాడని.. ఇరువురు గతంలోను ఘర్షణకు దిగారు. పెద్ద మనుషుల సమక్షంలో ఇరువురికి నచ్చజెప్పారు. మరోసారి బుధవారం అర్థ రాత్రి సాదిక్ ఇంటి బయట నిలబడి ఉండగా మరో ఘర్షణకు దిగారు. మాట మాట పెరగడంతో సాధిక్ పై కత్తులతో కిరాతకంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సాధిక్‌ను ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న ఫలక్‌నుమ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed