మావోయిస్టులపై విషప్రయోగం జరిగిందనే ప్రచారం అవాస్తవం: డీజీపీ జితేందర్

by Kalyani |
మావోయిస్టులపై విషప్రయోగం జరిగిందనే ప్రచారం అవాస్తవం: డీజీపీ జితేందర్
X

దిశ, సిటీక్రైం : ములుగు జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల సంఘటన పై వస్తున్న ఆరోపణల పై సోమవారం డీజీపీ జితేందర్ ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. విష ప్రయోగం చేసిన తర్వాత మావోయిస్టులు స్పృహ కోల్పోయిన తర్వాత కాల్పులు జరిపారని పౌర హక్కుల సంఘం చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం నిజం కాదన్నారు. ఇన్ ఫార్మర్ నెపంతో ఆదివాసులైన రమేశ్, ఉయిక అర్జున్ లను మావోయిస్టులు కత్తులతో పొడిచి హత్య చేశారని పేర్కొన్నారు. ఈ సంఘటనలను అడ్డుకునేందుకు పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా మావోయిస్టులు పోలీసుల పై అకారణంగా కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని వివరించారు. మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించారని స్పష్టమైందన్నారు. ఈ సంఘటనల్లో మొత్తం 7 గురు మావోయిస్టులు మరణించారని, హైకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచనల మేరకు మృత దేహాలకు శవ పరీక్షలను నిర్వహిస్తున్నామని డీజీపీ జితేందర్ ప్రకటనలో తెలిపారు. ఈ సంఘటన పై దర్యాప్తును ఇతర జిల్లా ఎస్పీకి అప్పగించామని , విచారణ కొనసాగుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed