- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GHMC :ట్యాక్స్ సిబ్బందికి నిర్బంధ టార్గెట్లు.. డిమాండ్‌కు తగ్గట్టు వసూలు చేయాల్సిందే
దిశ, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చడంతో అధికారులు ముందస్తు వసూళ్లకు సిద్ధమయ్యారు. వచ్చిన పైసలు వచ్చినట్టు అప్పులు, మిత్తీలు, కాంట్రాక్టర్ల బిల్లులకు సరిపోకపోవడంతో బల్దియా సతమతమవుతుంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తి పన్నుకు సంబంధించి వర్తమాన ఆర్థిక సంవత్సరం ప్రజలు చెల్లించాల్సిన పన్ను బకాయిలను ముందుగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పన్ను వసూలు చేస్తున్న బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లకు టార్గెట్లు నిర్ణయించి, వాటికి తగ్గట్టు వసూలు చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు.
రోజురోజుకూ పెరిగిపోతున్న అప్పులు, మిత్తీల చెల్లింపులు భారంగా మారుతున్నందున ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమనం కోసం బల్దియా పూర్తిగా రోజువారీ ఆస్తి పన్ను కలెక్షన్‌పైనే ఆధారపడుతూ, ఆర్థికంగా అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. గత నెల (జూలై) నెలాఖరు వరకు రూ. వెయ్యి కోట్ల ఆస్తి పన్నులు వసూలు చేసుకున్న బల్దియా ఇందులో భాగంగానే ఒక్క ఏప్రిల్‌లో అమలు చేసిన ఎర్లీ బర్డ్ స్కీం ద్వారా రూ. 740 కోట్లను వసూలు చేసుకుంది.
మే ప్రారంభం నుంచి జూలై నెలాఖరు వరకు మిగిలిన రూ. 260 కోట్లను వసూలు చేసుకుంది. ఆగస్టుకు సంబంధించిన కలెక్షన్ సిబ్బందికి రూ. 199.73 కోట్లు కాగా, 16వ తేదీ వరకు రూ.1037 కోట్లు వసూలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ట్యాక్స్ వసూళ్లు రూ. 2 వేల కోట్ల టార్గెట్ పెట్టుకున్న బల్దియా ఎప్పటికప్పుడు అవసరాలకు తగిన విధంగా సిబ్బందిపై ఒత్తిడి తెస్తూ ఇప్పటి వరకు రూ. 1037 కోట్లు వసూలు చేసుకోగా, మార్చి ఆఖరు కల్లా మిగిలిన రూ. 963 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. ఇందులో పాత బకాయిలను వసూలు చేసుకునేందుకు వడ్డీలో 90 శాతాన్ని మాఫీ చేస్తూ వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) స్కీం ద్వారా గత నెల 17 నుంచి ఈ నెల 16 వరకు రూ. 26 కోట్లు వసూలు చేసుకున్నారు.
టార్గెట్‌లో మిగిలిన రూ. 963 కోట్లలో ఇంకా రూ. 937 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ జీహెచ్ఎంసీలో నెలకొన్న ఆర్థిక అయోమయ పరిస్థితుల కారణంగా కాస్త ముందస్తుగానే ఈ మొత్తాన్ని వసూలు చేసుకునే పరిస్థితులున్నాయి. ఇదే జరిగితే వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో జీహెచ్ఎంసీ ఆర్థికంగా మరిన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనే పరిస్థితులున్నాయి. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో అమలు చేసే ఎర్లీ బర్డ్ స్కీం ముగిసే వరకు, అంటే జూన్ మొదటి వారంలో కాస్త ఊరట కలగనుంది.
నెలకు రూ. 200 కోట్లు కావాల్సిందే
ఎలాంటి పరిస్థితులు వచ్చినా జీహెచ్ఎంసీకి ప్రతి నెలా రూ. 200 కోట్ల చెల్లింపులు తప్పనిసరిగా జరపాల్సిందే. వీటిలో రూ. 20 కోట్ల పెన్షన్లు, రూ. 50 కోట్లు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు కాగా, మిగిలిన రూ. 70 కోట్లు పర్మినెంట్ ఎంప్లాయీస్, అధికారులు, ఉన్నతాధికారుల జీతాలు, పెన్షన్లు రూ. 140 కోట్లు, కాగా మరో రూ. 60 కోట్లు రొటీన్ మెయింటెనెన్స్ బిల్లుల చెల్లింపులు ఉన్నాయి. ఈ ఖర్చును బట్టి గమనిస్తే జీహెచ్ఎంసీకి వర్కింగ్ డే అయినా సెలవు రోజైనా రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల మధ్య నిధులు ఖజానాకు రావాల్సిందే. లేదంటే జీహెచ్ఎంసీ ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించలేని పరిస్థితి. కానీ ఆస్తి పన్ను ఒక్కోసారి రూ. కోటి దాటగా, మరి కొన్ని సార్లు రోజుకి రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షల్లోపు వసూలవటం అధికారులకు తలనొప్పిగా మారుతోంది.
ఎమర్జెన్సీ చెల్లింపులకూ చెక్
జీహెచ్ఎంసీలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చడంతో కొంతకాలంగా బిల్లు కోసం కాంట్రాక్ట ర్లు, జీతాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్లు పనులు నిలిపివేయడంతో స్పందించిన అధికారులు కాంట్రాక్ట ర్ల కుటుంబ సభ్యుల మెడికల్ ఎమర్జెన్సీ కోసం రూ. 5 లక్షల్లోపు బిల్లులు పెండింగ్‌లో ఉన్న వారికి కమిషనర్ ప్రత్యేక అనుమతితో చెల్లించేవారు. అది కూడా కాంట్రాక్టర్ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేరినట్లు రుజువులు చూపితేనే చెల్లించేవారు. కానీ ఇటీవల కొందరు కాంట్రాక్టర్లు తమ బిల్లులను కూడా క్లియర్ చేయాలని నిరసన వ్యక్తం చేయడంతో నిధుల లేమిని కారణంగా చూపుతూ మెడికల్ ఎమర్జెన్సీ కోసం జరిపే బిల్లుల చెల్లింపులను సైతం అధికారులు నిలిపివేశారు.