- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యూనెట్ యాజమాన్యం పై క్రిమినల్ చర్యలు చేపట్టాలి..
దిశ, ముషీరాబాద్ : క్యూ నెట్ యాజమాన్యం పై క్రిమినల్ చెర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని ఆమ్ ఆద్మీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని కోట్ల రూపాయలు వందలాది మంది నిరుద్యోగుల నుండి వసూలు చేసి భారీ మోసానికి పాల్పడ్డ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ( క్యూ నెట్ ) సంస్థ యాజమాన్యం పై క్రిమినల్ చర్యలు తీసుకొని, ఉద్యోగాల కోసం బాధితులు పెట్టిన పెట్టుబడి తిరిగి ఇప్పించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్ బషీర్ బాగ్ పాత పోలీస్ కమీషనర్ ఆఫీస్ లో ఉన్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఆర్థిక నేరాలు టీం 2 అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్ ఎన్.అశోక్ కుమార్ ను కలిసి డాక్టర్ దిడ్డి సుధాకర్ క్యూ నెట్ బాధితులతో కలసి ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరారు.
ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ అధిక ఆదాయాలను వాగ్దానం చేసి ఉద్యోగాలు కల్పిస్తామని సికింద్రాబాద్, నాచారం, హబ్సిగూడ శాఖలలో క్యూ నెట్ యాజమాన్యం కోట్ల రూపాయలు దండుకొని దాదాపు 300 నిరుద్యోగులను మోసం చేసిందని తెలిపారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వేల మంది క్యూ నెట్ బాధితులు ఉండవచ్చునని, బాధితులందరూ విద్యావంతులైన బడుగు బలహీనవర్గాలకు చెందినవారని అన్నారు. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురు క్యూ నెట్ ఉద్యోగులతో పాటు ఆ సంస్థలో పెట్టుబడి పెట్టి దోపిడీకి గురైన బాధితులందరికీ న్యాయం చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆయన కోరారు.
ఆర్థిక చట్టాలను అమలుచేసి, ఆర్థిక నేరాల పై పోరాడే బాధ్యత కలిగిన కేంద్ర ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా హైదరాబాద్ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (క్యూనెట్) సంస్థ నుండి రూ. 137 కోట్లు సీజ్ చేసి బాధితులకు సత్వర న్యాయం చేయకపోవడం దారుణం అని అన్నారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్, ఆర్థిక నేరాల అధికారులు దర్యాప్తు వేగవంతం చేసి విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (క్యూ నెట్) సంస్థ యాజమాన్యంపై కఠిన చెర్యలు తీసుకొని, బాధితులు పెట్టిన పెట్టుబడి తిరిగి ఇప్పించి న్యాయం చేయాలనీ ఆయన విజ్ఞప్తి చేసారు. క్యూ నెట్ బాధితులకు న్యాయం చేయాలని హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 27 వ జరిగే ధర్నాకు బాధితులందరు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని డాక్టర్ దిడ్డి సుధాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ ఎండి. మజీద్, బాధితులు దీపికా, శివ. శంకర్ తదితరులు పాల్గొన్నారు.