- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగన్వాడీ సేవలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలి : కలెక్టర్
దిశ, హైదరాబాద్ బ్యూరో: అంగన్వాడి సేవలు అందరికీ అందేలా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమగ్ర శిశు అభివృద్ధి సేవా, ఐసీడీఎస్ సేవలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం కోసం ఒక నిర్ణీత రోజును కేటాయించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో త్రాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇవి లేని వాటి వివరాలు తనకు సమర్పించాలని ఆదేశించారు. స్పెషల్ గ్రోత్ మానిటరింగ్ నిర్వహించి డేటా శాతాన్ని సమర్పించాలని ఆ సీడీపీఓలు, సూపర్ వైజర్లు ప్రతినెల నిర్దిష్టమైన తనిఖీలు చేపట్టాలని, బరువు లోపం, ఎదుగుదల సరిగా లేని పిల్లలను గుర్తించి ఎంత మంది ఉన్నారనేది వివరాలు ఇవ్వాలని కలెక్టర్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావు, సీడీపీఓలు, సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.