డాక్టర్ సంగాని మల్లేశ్వర్ కు రెండో డాక్టరేట్..

by Kalyani |
డాక్టర్ సంగాని మల్లేశ్వర్ కు రెండో డాక్టరేట్..
X

దిశ, సికింద్రాబాద్: కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం విభాగం హెడ్, ప్రముఖ బీసీ నాయకుడు డాక్టర్ సంగాని మల్లేశ్వర్ కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఓయూ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగంలో ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు పర్యవేక్షణలో 'సుపరిపాలనలో మీడియా పాత్ర కేస్ స్టడీ ఆఫ్ తెలంగాణ స్టేట్' అనే అంశంపై మల్లేశ్వర్ పరిశోధన పూర్తి చేసి సమర్పించిన పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచీ అధికారులు ఆయనకు పీహెచ్ డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.

గతంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్ మురళీమనోహర్ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను ఆయన మొదటి పీహెచ్ డీని పొందారు. తాజా పీహెచ్డీతో ఆయన అకాడమిక్ రంగంలో రెండు పీహెచ్ డీలు సాధించిన ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఓయూ, కేయూలకు చెందిన అధికారులు, అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు అభినందించారు.

Advertisement

Next Story