- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నగరంలో భారీ వర్షం.. స్కూళ్లకు సెలవు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వ్యాప్తంగా సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం దంచి కొట్టింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బందంలోకి వెళ్లాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నడుము లోతు నీరు వచ్చి చేరింది. దీంతో ద్విచక్రవాహనాలు, కార్లు పూర్తిగా నీటిలోనే ఉండిపోయాయి. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూళ్లకు సెలవు ప్రకటించాలని ఉదయం నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఉదయం నుంచి రెండు గంటల పాటు కురిసిన కుండపోత వర్షం కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు సెలవు ప్రకటించాయి. ఈ ఆయా స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యాల నుంచి వర్షం కారణంగా సెలవు ప్రకటిస్తున్నట్లు మెసెజులు, ఫోన్లు చేస్తున్నారు. కాగా ఈ రోజు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేశారు.