పప్పా.. నువ్వు మళ్లీ జన్మించొద్దు.. నేనే వస్తాను: కూతురి కన్నీటి లేఖ

by Prasanna |
పప్పా.. నువ్వు మళ్లీ జన్మించొద్దు.. నేనే వస్తాను: కూతురి కన్నీటి లేఖ
X

దిశ, సినిమా : ప్రముఖ దివంగత నటుడు, దర్శక నిర్మాత సతీష్ కౌశిక్ మరణాన్ని తలచుకుంటూ తన 11ఏళ్ల కూతురు వంశిక రాసిన కన్నీటి లేఖ అందరి హృదయాలను బరువెక్కించింది. ఏప్రిల్ 13న సతీష్ కౌశిక్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన స్మారక కార్యక్రమంలో పాల్గొన్న వంశిక.. తండ్రి కోసం తాను రాసుకున్న నాలుగు మాటలను అందరికీ చదివి వినిపించింది. ‘హలో పప్పా.. ఇప్పుడు నువ్వు మాతో లేవని నాకు తెలుసు. కానీ, నేను ఎప్పుడూ నీ వెంటే ఉంటానని నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మనం మళ్లీ మరో 90 ఏళ్లలో కలుద్దాం. దయచేసి అప్పటిదాకా మీరు పునర్జన్మను అంగీకరించొద్దు. 90 ఏళ్ల తర్వాత నేను అక్కడకొచ్చి నిన్ను తప్పకుండా కలుస్తా’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఈ భావోద్వేగపూరితమైన వీడియోను నటుడు అనుపమ్ ఖేర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.

Advertisement

Next Story