హైదరాబాద్‌లో రేవ్ పార్టీ భగ్నం.. 14 మంది యువకులు, ఆరుగురు యువతులు అరెస్ట్..!

by Satheesh |   ( Updated:2024-07-25 13:06:19.0  )
హైదరాబాద్‌లో రేవ్ పార్టీ భగ్నం.. 14 మంది యువకులు, ఆరుగురు యువతులు అరెస్ట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: మొన్నటి వరకు హైదరాబాద్ నగర శివార్లకే పరిమితమైన రేవ్ పార్టీ కల్చర్.. ఇప్పుడు ఏకంగా సిటీలోకి పాకింది. తాజాగా హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలకు నిలయమైన సైబర్ టవర్స్ వద్ద రేవ్ పార్టీ కలకలం రేపింది. సైబర్ టవర్స్ వద్ద ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్ నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక దాడులు చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారు. పార్టీ ఆర్గనైజర్ నాగరాజుతో పాటు 14 మంది యువకులు, 6 గురు యువతులను రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. భారీగా విదేశీ మద్యంతో పాటు కొకైన్, ఓజీ కుష్, ఎండీఎంఏ వంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ పక్కా రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంటే.. మరోవైపు ఏకంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున రేవ్ పార్టీ నిర్వహించడం సంచలనంగా మారింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story