- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొట్టెల.. ఊరేగింపు ఎలా ?
దిశ, మెహిదీపట్నం : ప్రఖ్యాతి గాంచిన గోల్కొండ నజర్ బోనం సమీపిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం నిర్వహించే మొదటి బోనం సందర్భంగా లంగర్ హౌస్ నుంచి గోల్కొండ వరకు ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రముఖులు హాజరవుతారు. అయితే ఊరేగింపు నిర్వహించే ప్రధాన రహదారి పై గుంతలు ఉన్నాయి. ఇటీవల అభివృద్ధి పనుల కోసం పైప్లైన్లు, డ్రైనేజీ తదితర పనుల కోసం అధికారులు పనులు చేపట్టారు.
పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారి పై పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఎప్పటికప్పుడు అధికారులు సమన్వయంతో ముందుకు సాగాల్సింది పోయి పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ శాఖల అధికారులతో కలిసి చర్యలు తీసుకోవాల్సిన ఎండోమెంట్ అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. తెలుగు గోల్కొండ పాఠశాల వద్ద, సమీప ప్రాంతాల్లో మట్టి దిబ్బలు, రాళ్లు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి.
రూట్ మ్యాప్ పరిశీలన..
ఆదివారం రాత్రి గోల్కొండ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తోటలో ఊరేగింపు నిర్వహించే రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించారు. సిబ్బంది ఈ మేరకు నోట్ చేసుకున్నారు. విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. తొలి గురువారం నిర్వహించే తొలి బోనం, తొట్టెల ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా ప్రజాప్రతినిధులు భక్తులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.