ఆలుగడ్డ బావి చౌరస్తా వద్ద పెట్రోల్ ట్యాంకర్ బోల్తా...

by Kalyani |
ఆలుగడ్డ బావి చౌరస్తా వద్ద పెట్రోల్ ట్యాంకర్ బోల్తా...
X

దిశ, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ ఆలుగడ్డ బావి చౌరస్తా వద్ద వెనుక టైరు పగిలి పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. పెట్రోల్ ట్యాంక్ నుంచి భారీగా పెట్రోల్, డీజిల్ రోడ్డుపై పడింది. సమాచారం అందుకున్న చిలకలగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిహెచ్. శ్రీనివాసులు సకాలంలో స్పందించి తమ ట్రాఫిక్ సిబ్బందితో కలిసి ట్రాఫిక్ ను మళ్లించడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ట్రాఫిక్ ను డైవర్ట్ చేసిన పోలీసులు దాదాపు రెండు గంటల పాటు శ్రమించి పెట్రోల్ ట్యాంక్ ను క్రేన్ ల సహాయంతో తరలించారు.

నార్త్ జోన్ డిసిపి సాధన రేష్మి పెరుమాళ్, ఈస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ సంపత్ కుమార్, గోపాలపురం ట్రాఫిక్ వెంకట్ రాములు, చిలకలగూడ సీఐ అనుదీప్, గోపాలపురం సీఐ నరేష్, మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రాసురీ సునీత ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చర్లపల్లిలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లో 10 వేల లీటర్ల పెట్రోల్, 10 వేల లీటర్ల డీజిల్ లోడింగ్ తో సూరారం కాలనీ లోని పెట్రోల్ బంక్ కు వెళ్తున్న ట్యాంకర్ ఆలుగడ్డ బావి చౌరస్తా వద్ద వద్ద టైరు పేలడంతో ట్యాంకర్ బోల్తా కొట్టింది. పెట్రోల్, డీజిల్ రోడ్డుపై పడడంతో ఫైరింజన్ల సహాయంతో ఫోమ్ కొట్టి, దానిపై జిహెచ్ఎంసి సిబ్బంది సహాయంతో మట్టి వేసి కవర్ చేశారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed