- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో పెలికాన్ సిగ్నల్స్.. ప్రారంభించిన సీపీ సీవీ ఆనంద్
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పాదచారుల కోసం పెలికాన్ సిగ్నళ్లను హైదరాబాద్ పోలీసులు బుధవారం అందుబాటులోకి తెచ్చారు. నగరంలోని వేర్వేరు రోడ్లపై అమర్చారు. ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన పెలికాన్ సిగ్నల్‌ను హైదరాబాద్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ లోని పలు రోడ్లను దాటాలంటే పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాటాల్సిన పరిస్థితి నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ట్యాంక్ బండ్, అసెంబ్లీ, సంజీవరెడ్డి నగర్, మలక్ పేట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది.
కొన్ని చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేసినా వృద్ధులు, పిల్లలు వాటిని ఉపయోగించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలోనే పెలికాన్ సిగ్నళ్లను ఏర్పాటు చెయ్యాలని అధికారులు నిర్ణయం చేశారు. రోడ్డు దాటే సమయంలో పాదచారులు ఈ సిగ్నల్‌ను ఆన్ చేస్తే వాహనదారులు ఆగాల్సి ఉంటుంది. రోడ్డు దాటిన తర్వాత పాదచారులు సిగ్నల్‌ను ఆఫ్ చేసిన తర్వాత ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.