హైదరాబాద్‌లో ఆపరేషన్ ‘ధూల్ పేట్’.. కీలక నిందితుడు రాహుల్ సింగ్ అరెస్ట్..!

by Satheesh |
హైదరాబాద్‌లో ఆపరేషన్ ‘ధూల్ పేట్’.. కీలక నిందితుడు రాహుల్ సింగ్ అరెస్ట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా మార్చాలని కంకణం కట్టుకుంది. మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ విషయంలో ఉక్కు పాదం మోపాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ భారీగా డ్రగ్స్, గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖల ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ ధూల్ పేట్’ పేరుతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా 54 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు గంజాయిని విశాఖ నుండి తీసుకొచ్చినట్లు గుర్తించారు.

ఒక్క చోటే బల్క్‌గా గంజాయిని డంప్ చేస్తే దొరికిపోతామన్న అనుమానంతో నగరంలోని వేర్వేరు చోట్ల గంజాయిని దాచారు. ఈ సమాచారం మేరకు పోలీసులు నగరంలోని సీతాఫల్ మండి, మైలారంగడ్డ, చిలకలగూడలో దాడులు నిర్వహించి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లింగ్‌లో కీలక నిందితుడైన రాహుల్ సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆగస్ట్ 31 నాటికి గంజాయి అమ్మకాలు, రవాణా వినియోగం లేకుండా చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ ధూల్ పేట్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు

Advertisement

Next Story

Most Viewed