- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడుతారా?.. ప్రజలను గుడ్డిగా నమ్మించారని రాష్ట్ర అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాదులోని చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు నిన్న(ఏప్రిల్ 19) భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. సంతానప్రాప్తి దివ్యఔషధం పంపిణీ సందర్భంగా జనాలు అధిక సంఖ్యలో రావడంతో ఓఆర్ఆర్, మొయినాబాద్ మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో దాదాపు చిలుకూరులో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా పలువురు భక్తులు అస్వస్థతకు కూడా గురయ్యారు. అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్ లో పంచే గరుడ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందనే వార్తలు విస్తృతం కావడంతో కేవలం తెలుగు ప్రజలే కాకుండా కర్ణాటక తమిళనాడు నుంచి భారీ ఎత్తున తరలివచ్చారు. వంద కాదు వెయ్యి కాదు.. ఏకంగా 2 లక్షల మంది సందర్శించారని ఆలయ అధికారులు చెప్పారు. ప్రసాదం దొరకక చాలా మంది కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఈ ఘటనపై తాజాగా జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోయ వెంకటేశ్వరరావు స్పందించారు. ప్రసాదం తింటే పిల్లలు పుడతారని నమ్ముతున్నారంటే ఆ తప్పు ప్రజలది కాదు.. వారిని అలా నమ్మించిన పరిస్థితులదని అన్నారు. ప్రసాదం తింటే పిల్లలు పుడతారనే నమ్మకాన్ని జేవీవీ దేశంలో విజ్ఞాన శాస్త్ర దారిద్య్రంగా అభివర్ణించారు.