దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లోని నిర్మాణాలకు నోటీసులు

by Nagam Mallesh |
దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లోని నిర్మాణాలకు నోటీసులు
X

దిశ, శేరిలింగంపల్లిః చెరువుల కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దుర్గం చెరువు పరిరక్షణ కోసం చర్యలకు ఉపక్రమించింది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లో ఉన్న నెక్టర్స్‌ కాలనీ, డాక్టర్స్‌ కాలనీ, కావూరీ హిల్స్‌, అమర్‌ సొసైటీ వాసులకు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పలు ఇళ్లకు నోటీసులను అంటించారు. వీరికి నెల రోజుల గడువు ఇస్తూ ఎఫ్‌టీఎల్‌ను ఆక్రమించిన కట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని స్పష్టం చేశారు. ఒక్కరోజే ఈ నాలుగు కాలనీల్లోని వందల ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు వాల్టా చట్టంలోని సెక్షన్‌ 23(1) కింద నోటీసులు ఇచ్చారు. లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో దుర్గం చెరువు పరిసర కాలనీలో ఇప్పుడు నోటీసుల అంశం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed