అణగారిన వర్గాలకు అండగా ఎంఎస్‌పి: Manda Krishna Madiga

by sudharani |   ( Updated:2023-01-04 13:45:36.0  )
అణగారిన వర్గాలకు అండగా ఎంఎస్‌పి: Manda Krishna Madiga
X

దిశ, సికింద్రాబాద్: అణగారిన వర్గాలకు అండగా ఎంఎస్‌పి నిలుస్తుందని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు. పార్సిగుట్టలోని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలో మహాజన సోషలిస్టు పార్టీ (ఎంఎస్‌పి) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరై మాట్లాడారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం పునాదిగా అణగారిన పీడితవర్గ ప్రజల అభివృద్ధి కోసమే మహాజన సోషలిస్టు పార్టీ ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. అణగారిన వర్గాల సహాకారంతో అధికారంలోకి వచ్చిన పాలకులు ఆ వర్గాల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.

దేశంలో బీసీ ప్రధానం అన్న ప్రచారం మాత్రమే ఉంది కానీ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదలకు న్యాయం జరగాలంటే అది మహాజన సోషలిస్టు పార్టీతోనే సాధ్యమని తెలిపారు. అందుకోసం గ్రామ స్థాయి నుండి పార్టీ నిర్మాణాలను బలోపేతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ విజయరావు మాదిగ, తిప్పారాపు లక్ష్మణ్ మాదిగ, మంథని సామ్యెల్ మాదిగ, హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ రాజు మాదిగ, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు సోమశేఖర్ మాదిగ డప్పు మల్లిఖార్జున్ మాదిగ' దయాల నర్సింగ్ రాజ్ మాదిగ, నాధారం సీతారాం మాదిగ, మహేష్ మాదిగ, విష్ణు మాదిగ, సుజాత మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed