Kalvakuntla Kavitha : ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఎమ్మెల్సీ కవిత

by Naresh |   ( Updated:2023-11-30 05:22:10.0  )
Kalvakuntla Kavitha : ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఎమ్మెల్సీ కవిత
X

దిశ, ఖైరతాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. ఎన్నికల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌ పోలింగ్ స్టేషన్‌లో కవిత తన ఓటును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కోడ్ ఉల్లంఘించి బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కవిత వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్ దృష్టికి తెచ్చి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story