ఇక ట్రాఫిక్ ఇబ్బందులుండవు : మంత్రి తలసాని

by Disha News Web Desk |
ఇక ట్రాఫిక్ ఇబ్బందులుండవు : మంత్రి తలసాని
X

దిశ, బంజారాహిల్స్: పంజాగుట్ట నుంచి కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం పంజాగుట్ట స్మశాన వాటిక పాత గేట్ నుంచి విద్యుత్ పోల్ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి‌ని గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు. సుమారు రూ.17 కోట్లతో నిర్మించిన ఈ ఉక్కు బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో స్మశాన వాటికకు వెళ్లేందుకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను ప్రణాళిక ప్రకారం తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, అందులో భాగంగానే షేక్‌పేట ప్లై ఓవర్‌ను, నేడు పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి‌లను ప్రజలకు అందుబాటులో తెస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానిక కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed