నన్ను ఇంకా వేధిస్తున్నారు: మంత్రి సీతక్క ఆవేదన

by srinivas |
నన్ను ఇంకా వేధిస్తున్నారు: మంత్రి సీతక్క ఆవేదన
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళలకు సమాజంలో ఎదురయ్యే వెక్కిరింతలు, వేధింపులను అస్సలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పేర్కొన్నారు. శనివారం మాదాపూర్‌లోని ఒక హోటల్లో జరిగిన డెమోక్రటిక్ సంఘ నిర్వహించిన గ్రామీణ మహిళల లీడర్షిప్ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గీతారెడ్డి, ప్రముఖ నటి రెజీనా కెసాండ్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళలంటే కొందరికి చిన్న చూపు ఉంటుందని, పేదరికం నుంచి వచ్చిన తాను మంత్రి అయినా కూడా కించపరుస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా వేధిస్తూనే ఉన్నారని వాపోయారు. అయితే, వాటిని పట్టించుకుంటే ముందడుగు వేయలేమని మహిళల్లో మనోధైర్యం నింపారు. సమ సమాజం కోసం ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటానని చెప్పారు. గ్రామీణ మహిళలకు మర్యాదనిచ్చే గొప్ప మనసు ఉంటుందని,

వాళ్ల సమస్యలను తెలుసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో డెమోక్రటి సంఘం పరిష్కరించాలన్నారు. స్థానిక ప్రభుత్వాలు మహిళలకు 33% రిజర్వేషన్లు రాజీవ్ గాంధీ కల్పించారని గుర్తు చేశారు. దాంతో, స్థానిక ప్రజా ప్రతినిధులుగా మహిళలు రాజకీయాల్లో ముందడుగు వేశారన్నారు. మహిళలు ముందుకు రాగానే వెనక్కు లాగే ప్రయత్నాలు జరుగడం బాధాకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళా సంఘాల ఆర్థికంగా బలోపేతంపై దృష్టి పెట్టామన్నారు. బ్యాంకుల ద్వారా వ్యాపారాలు చేసుకునేందుకు రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. మహిళలకు ఆర్దిక పునాదికి ముఖ్యమని… ఎంత ఆర్థిక ప్రగతి సాధించిన మహిళలను లైంగికంగా వేధిస్తూనే ఉన్నారన్నారు. ఎందుకు మహిళలంటే చిన్నచూపు అని... కలకత్తాలో డాక్టర్ రేప్ చేసిన హత్య చేశారన్నారు. మగవాళ్ళతో సమానంగా ఎదగడమే ఆ డాక్టర్ చేసిన నేరమా? అని అన్నారు. మహిళలను ఆర్థిక రంగంలో, సామాజిక భద్రతకి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నేరాన్ని జరగకముందే ఎలా నివారించాలో అధ్యయనం చేస్తున్నామన్నారు. శిక్షతోపాటు శిక్షణ ఇవ్వాలన్నారు. మహిళలను దేవతలుగా కొలుస్తామని సీతక్క పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed