- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రీడా హబ్‌గా తెలంగాణ : మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, తెలంగాణ బ్యూరో: క్రీడా హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈనెల 14 నుంచి 19 వరకు దుబాయ్ లో జరిగిన బ్యాడ్మింటన్ ఏషియా కప్ లో మిక్స్ డ్ టీం ఛాంపియన్ షిప్ లో బ్రాంజ్ మెడికల్ సాధించిన క్రీడాకారులు పంజాల విష్ణువర్దన్ గౌడ్ ను హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలోని మంత్రి కార్యాలయంలో బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దిక్సూచిగా నిలబడిందన్నారు. బ్యాడ్మింటన్, టెన్నిస్, రెజ్లింగ్, కబడ్డీ, వాలీబాల్, బాక్సింగ్ లాంటి ఎన్నో క్రీడలలో క్రీడాకారులు విశేష ప్రతిభను కనబరుస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలను సాధిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావు గౌడ్, దేవేందర్ గౌడ్, గౌడ్, సంజయ్ గౌడ్, వెంకట్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.