- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
former ministers : ముఖేష్ గౌడ్ 5 వ వర్ధంతికి పలువురు మాజీమంత్రులు..
దిశ, కార్వాన్ : దివంగత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ 5 వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన సంస్మరణ సభకు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని, పద్మారావు, ఎమ్మెల్యేలు కాలేరు, మాగంటి గోపీనాథ్, రాజ సింగ్, మక్కన్ సింగ్, ఎమ్మెల్సీ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి, విష్ణు వర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ హాజరై ముఖేష్ గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళలర్పించారు. కొడుకులు విక్రమ్ గౌడ్, విశాల్ గౌడ్ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని, అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం బాధాకరమన్నారు. రాజకీయంగా విక్రమ్ గౌడ్, తండ్రి అంతటి స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.