మెడకు చీరను బిగించుకొని వ్యక్తి బలవన్మరణం

by Disha News Web Desk |
మెడకు చీరను బిగించుకొని వ్యక్తి బలవన్మరణం
X

దిశ, మియాపూర్: ఉరి వేసుకొని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. స్థానిక ఎస్ఐ రవికుమార్ వివరాల ప్రకారం.. హఫీజ్‌పేట్‌ ప్రేమ్‌నగర్‌లో నివాసముండే వెంకటేశ్(36) కూలీపని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పదేళ్ల క్రితం అతనికి వివాహం కాగా, వెంకటేశ్ తల్లి దండ్రుల వద్ద ఉంటుండగా, భార్య ఇద్దరు పిల్లలతో వేరు కాపురం ఉంటున్నది. ఒంటరిగా ఉండడంతో వెంకటేష్ మద్యానికి బానిసయ్యాడు. అంతేగాక, ఫిట్స్ సమస్యతో బాధపడుతున్నాడు. బుధవారం సాయంత్రం కూలీ పని ముగించుకుని ఇంటికి వస్తూనే మద్యం తెచ్చుకున్నాడు. మద్యం సేవించిన అనంతరం అదే మత్తులో చీరను మెడకు బిగించుకొని ఊపిరి ఆడకుండా చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన తల్లి, వెంకటేశ్‌ను విగత జీవిగా పడిఉండటాన్ని చూసి భయంతో స్థానికులను పిలిచింది. అప్పటికే మృతిచెంది ఉండగా, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story