- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామాలయంలో ఇత్తడి నాగ పడిగెను దొంగిలించిన వ్యక్తి అరెస్ట్..
దిశ, చార్మినార్: పాతబస్తీ రామాలయంలో నుంచి ఇత్తడి నాగ పడిగెను మరో వర్గానికి చెందిన వ్యక్తి దొంగిలించి పారిపోతుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం అతన్ని మొఘల్ పుర పోలీసులకు స్థానికులు అప్పగించారు. మొఘల్ పుర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ తలాబ్ కట్ట కు చెందిన అహమద్ అలియాస్ రహమత్ (50) శుక్రవారం రాత్రి 8.30 గంటలకు లాల్ దర్వాజా మోడ్ లోని రామాలయం లోకి వెళ్ళాడు. రామాలయంలో సాయిబాబా ఆలయం కూడా ఉండడంతో మొదట అతను మొక్కడానికి వచ్చి ఉండవచ్చని భావించారు. కాసేపట్లోనే శివలింగానికి అలంకరించిన ఇత్తడి నాగ పడిగెను దొంగిలించి నల్లటి వస్త్రం లో చుట్టి పరారవ్వడానికి ప్రయత్నించగా స్థానికంగా ఉండే ఆనంద్ జైన్ అనే వ్యక్తి గమనించాడు. పరారవుతున్న రహమత్ ను పట్టుకుని, మొఘల్ పుర పోలీసులకు అప్పగించారు. హుండీ లోని రూ. 200 నగదు కూడా కనిపించలేదు. దీంతో ఆలయ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొఘల్ పుర పోలీసులు రహమత్ ను అరెస్ట్ చేసి శనివారం రిమాండ్ కు తరలించారు. ఈ కేసును మొఘల్ పుర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.