క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలి

by Sridhar Babu |
క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలి
X

దిశ, హిమాయత్ నగర్ : ప్రతి ఒక్కరూ క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నేషనల్ స్పోర్ట్స్ పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్రీడాపోటీలను ప్రారంభించారు.

ఈ క్రీడా పోటీలు నేటి నుంచి 29 వ తేదీ వరకు కొనసాగుతాయని అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా వ్యాయామంతో పాటు క్రీడలు కూడా ఆడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో కంపల్సరిగా ఒక స్పోర్ట్స్ పిరియడ్ ఉండేదని, నేడు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రతి పాఠశాలలో స్పోర్ట్స్ పీరియడ్ స్పష్టంగా ఉండేటట్లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. అరగంట సమయాన్ని క్రీడలకు, కసరత్తులకు కేటాయిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం లో టీఎన్జీవోఎస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed