- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన క్రాంతి కుమార్ దంపతులు
దిశ, చార్మినార్: పాతబస్తీకి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి ఎస్పీ క్రాంతి కుమార్ దంపతులు మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన తండ్రి పాండురంగారావు కూడా కాంగ్రెస్ పార్టీకి పాతబస్తీలో ఎనలేని సేవలు చేశారని, ఆయన మరణాంతరం తన కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీ సేవలో ఉన్నామని గుర్తు చేశారు. 2002 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎస్ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ లో అసెంబ్లీ, నగర, రాష్ట్ర కమిటీలో వివిధ హోదాలో పనిచేయడం జరిగిందని, తనతో పాటు తన భార్య ఎస్.శైలజ 3 సార్లు యువజన కాంగ్రెస్ ఇంటర్నల్ ఎలక్షన్స్ లో పాల్గొని ఎన్నికయ్యారని, ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తూ వచ్చామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తమ కుటుంబం నాలుగు దశాబ్దాలుగా పని చేస్తూ వస్తున్నామని కానీ ప్రస్తుత తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుణ్యమా అని టీ-కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ గా మారిందని, ఎన్నో ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నాయకులకు కానీ, బీసీ నాయకులకు కానీ, యువజన కాంగ్రెస్ నాయకులకు కానీ పార్టీ టికెట్స్ ఇవ్వకుండా సర్వేల పేరిట మాజీ టీడీపీ నాయకులకు, పారాచూట్లకు పెద్ద పీట వేయడం, కాంగ్రెస్ సిద్దాంతాలు తెలియని వారికి కూడా టికెట్ లు ఇవ్వడం బాధాకరమని, ఆయన పారాసైట్ గా అసలైన కాంగ్రెస్ నాయకులకి అన్యాయం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
Also Read..