- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
former AP Minister follower : ఏపీ మాజీమంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు శశికాంత్ ఇంట్లో ఐటీ రైడ్స్..
దిశ, శేరిలింగంపల్లి : ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరుల పై ఐటీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పలు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించిన పెద్దిరెడ్డి పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి అక్రమాల పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇంటలిజెన్స్ విచారణకు ఆదేశించారు. ఓవైపు ఇంటెలిజెన్స్ అధికారుల విచారణ సాగుతుండగానే మరోవైపు ఐటీ రైడ్స్ జరగుతుండడంతో ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది.
హైదరాబాద్ లోనూ ఆయన అనుచరుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఆదివారం పెద్దిరెడ్డి అనుచరుడు శశికాంత్ నివాసం ఉంటున్న మాదాపూర్ అయ్యప్ప సోసైటీలోని ఆర్ఆర్ అపార్ట్మెంట్ లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. శశికాంత్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నట్లు సమాచారం. శశికాంత్ నుంచి ఐటీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.