- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పుల మీద తప్పులు.. ఇష్టారాజ్యంగా సర్టిఫికెట్ల జారీ
దిశ, సిటీ బ్యూరో: మహానగరంలోని కోటిన్నర మంది జనాభాకు అత్యవసర సేవలందించాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారయ్యా.. అంటే చేసిన తప్పులు లెక్కపెట్టుకుంటున్నారన్నట్టుంది పరిస్థితి. జీహెచ్ఎంసీలో ఇటీవలే అవసరమైన పత్రాలేమీ లేకుండా జారీ చేసిన 31 వేల బోగస్ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగు చూసినా జీహెచ్ఎంసీ కనీసం బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ లో మాత్రం మారలేదు. బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం వచ్చే దరఖాస్తుల నుంచి బహిరంగంగా వేలల్లో లంచాలు డిమాండ్ చేస్తున్న సర్కిళ్లలోని మెడికల్ ఆఫీసర్లు, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్లు లంచాలిచ్చేందుకు ససేమిరా అనే దరఖాస్తుదారుల సర్టిఫికెట్లలో కావాలనే ఉద్దేశపూర్వకంగా తప్పులు తడకలుగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల భారీ సంఖ్యలో బోగస్ సర్టిఫికెట్లు వెలుగుచూసినా, ఉన్నతాధికారులు తమ అధికారులు, సిబ్బంది అవినీతిని ప్రస్తావించకుడా , పొరపాటంతా మీ సేవా కేంద్రాలపై నెట్టేసిన సంగతి తెల్సిందే. అంటే సర్కిళ్లలోని సిబ్బంది అవినీతిని, లంచాల డిమాండ్‌ను ఉన్నతాధికారులు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.
లంచమివ్వకుంటే సర్టిఫికెట్ లో తప్పులు
జీహెచ్ఎంసీ మహానగరావాసులకు అందించే సేవల్లో అతి ముఖ్యమైనది జనన, మరణ ధృవీకరణ సర్టిఫికెట్లు. ప్రస్తుతం దరఖాస్తు సమర్పించిన 24 గంటల్లోనే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని పురపాలక శాఖ అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నా, జారీ చేస్తున్న సర్టిఫికెట్లలో ఎన్ని తప్పులున్నాయన్న విషయాన్ని అంగీకరించటం లేదు. సర్కిల్ ఆఫీసుల్లోని సిబ్బంది అడిగినంత చెల్లించకుంటే వారు కావాలనే ఉద్దేశపూర్వకంగా సర్టిఫికెట్‌లో తప్పులు ముద్రిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీసు సెంటర్లలో ఈ సర్టిఫికెట్లు జారీ చేసేటపుడు అంతంతమాత్రంగా తప్పులు వచ్చేవని, మీ సేవా కేంద్రాలకు అప్పగించిన తర్వాత సర్టిఫికెట్‌లో వివరాలు అప్ లోడ్ చేసేటపుడే సర్కిల్ సిబ్బంది ఉద్దేశపూర్వకంగా తప్పుగా ముద్రిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో ట్రాన్సక్షన్ కు రూ. 30 చెల్లించి మీ సేవా కేంద్రంలో దరఖాస్తులు సమర్పించినా, తమకు కావల్సిన డీటైల్స్‌తో, తప్పుల్లేకుండా సర్టిఫికెట్ జారీ చేయటం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు సమర్పించిన వెంటనే సర్టిఫికెట్ ను ఆమోదించాల్సిన జీహెచ్ఎంసీ సర్కిల్ మెడికల్ ఆఫీసర్, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ లాగిన్ కు వివరాలు వెళ్తాయి. వాటిని వెరిఫై చేసుకుని ఆమోదం ఇవ్వాల్సిన మెడికల్ ఆఫీసర్లు, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్లు చేతులు తడపనిదే ఆమోదించటం లేదని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు.
తప్పెవరిది? శిక్ష ఎవరికి?
జననం గానీ, మరణం గానీ సంభవించిన ఆస్పత్రి సిబ్బంది, ఈ సేవా కేంద్రం, బల్దియా ఆఫీసులోని సిబ్బంది గానీ తప్పు చేస్తే దాని శిక్ష దరఖాస్తుదారుడికి పడుతుంది. బల్దియా సిబ్బంది అడిగిన లంచం ఇవ్వకపోతే వారు సర్టిఫికెట్లలోని పేర్లు తప్పుగా ప్రింట్ చేసి ఇస్తున్నారు. దీంతో దరఖాస్తుదారుడు అభ్యంతరం తెలపగా, మీరు దరఖాస్తులో రాసిందే ఇస్తున్నామని బుకాయిస్తూ, ఈ సేవా కేంద్రంలో మళ్లీ రూ. 30 చెల్లించి దరఖాస్తును రీ సబ్ మిట్ చేయమని ఉచిత సలహాలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.