సాలార్​జంగ్​ మ్యూజియంలో ఆకట్టుకున్న ఆద్యకళా ప్రదర్శన..

by Sumithra |   ( Updated:2023-06-12 15:54:14.0  )
సాలార్​జంగ్​ మ్యూజియంలో ఆకట్టుకున్న ఆద్యకళా ప్రదర్శన..
X

దిశ, చార్మినార్​ : తెలంగాణ సాంస్కృతి సంప్రదాయలను తెలియజేసే గిరిజన గ్రామీణ కళ ఖండలను సేకరించడం అధ్బుతమని మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్​మెంట్​ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ అన్నారు. సోమవారం సాలర్ జంగ్ మ్యూజియంలో జయదిర్ తిరుమల్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆద్యకళ ఎగ్జిబిషన్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కళాఖండాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ జయదిర్ తిరుమల్ రావు ఇన్ని కళాఖండాలను సేకరించడం గర్వించదగ్గ విషయమన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలను తెలియజేసే గిరిజన గ్రామీణ కళాఖండాలను కాపాడి రాబోయే తరాలకు మన సాంస్కృతి సంప్రదాయలను తెలియజేస్తామన్నారు.

అనంతరం జయదీర్ తిరుమల్ రావు మాట్లాడుతూ గత 45 సంవత్సరాలుగా తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్​ఘడ్, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాలలోని మారు మూల గ్రామాలు గిరిజన ప్రాంతాల నుంచి సుమారు నాలుగు వేల కళ ఖండలను సేకరించానని వాటిలో రెండు వేల ఒక్క వంద ప్రదర్శన లో పెట్టడం జరిగిందన్నారు. ఈ కళా ఖండాలు నేటి వరకు దేశంలోని ఏ మ్యూజియం లో లేవన్నారు. ఈ కళా ఖండాలను స్టేట్ ఆర్ట్స్ గ్యాలారీ, రవీంద్ర భారతి, సప్త పరిణి, గుంటూరు లలో ప్రదర్శించమన్నారు. ఈ కార్యక్రమంలో డేనియల్, మనోజ, సాలర్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read..

కేసీఆర్.. టైమ్ వచ్చింది.. ఇక సామాన్లు సర్దుకో: మహేష్​ కుమార్​ గౌడ్​ ఫైర్

Advertisement

Next Story

Most Viewed