HYDRA: ‘హైడ్రా’ చట్టబద్ధమైనదే.. కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-09-14 09:02:23.0  )
HYDRA: ‘హైడ్రా’ చట్టబద్ధమైనదే.. కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘హైడ్రా’ చట్టబద్ధతను కొందరు ప్రశ్నిస్తున్నారని.. హైడ్రా చట్టబద్ధమైనదేనని ఆ సంస్థ కమిషనర్ ఏవీ.రంగనాథ్ (AV Ranganath) స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీవో నెం.99 ద్వారా జూలై 19న ప్రభుత్వం హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection) నెలకొల్పబడిందని అన్నారు. కార్యనిర్వాహక తీర్మానంతోనే సంస్థ ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు. హైడ్రా చట్టబద్ధతపై ప్రభుత్వం పని చేస్తుందని, వచ్చే నెల రోజుల్లోగా అందుకు సంబంధించి పూర్తి విధివిధానాతో ఆర్డినెన్స్ (Ordinance) విడుదల చేస్తారని తెలిపారు.

హైడ్రాకు త్వరలోనే విశేష అధికారాలతో పాటు ఆరు వారాల తరువాత అసెంబ్లీ (Assembly)లో ‘హైడ్రా’ బిల్లు రాబోతోందని పేర్కొన్నారు. ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో అక్రమ నిర్మాణాల విషయంలో మున్సిపాలిటీలు, నీటి పారుదల, రెవెన్యూ శాఖలకు హైడ్రా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. గ్రే హౌండ్స్, టాస్క్‌ఫోర్స్ తరహాలో తాము పని చేస్తామని రంగనాథ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed