- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాంకీ’ బెదిరింపులకు దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. రూ.40 కోట్లు విడుదల
దిశ, సిటీ బ్యూరో: ప్రభుత్వ శాఖల కన్నా ప్రైవేటు సంస్థలపైనే సర్కారుకు ప్రేమ ఎక్కువైందన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీకి నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోని ప్రభుత్వం ‘రాంకీ’ బెదిరింపులకు దిగొచ్చి గంటల వ్యవధిలోనే రూ.40 కోట్లు విడుదల చేయడం గమనార్హం. 2015 వరకు జీహెచ్ఎంసీ ఖజానాలో పుష్కలంగా నిధులున్నాయి.
సర్కారు ఎస్ఆర్‌డీపీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులు చేపట్టిన తర్వాత ఖజానా మొత్తం ఖాళీ అయింది. 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సహాయానికి బల్దియా ఖజానా నుంచి ఏకంగా రూ.560 కోట్లు వెళ్లి పోయాయి. చివరకు జీతాలు, పెన్షన్ల చెల్లింపులతో పాటు రోజువారీ మెయింటెనెన్స్ కూడా జీహెచ్ఎంసీకి కష్టతరంగా మారింది. ఏటా సర్కారు బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయించాలంటూ 8 ఏండ్ల నుంచి ప్రతిపాదనలు పంపుతున్నా ఫలితం లేకుండా పోతున్నది.
ఐదు గంటల సమ్మెకు ఇంత రెస్పాన్సా?
ప్రత్యేక రాష్ట్ర ఏర్పడగానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఆనాడు కేసీఆర్ హామీనిచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో ఇదే శానిటేషన్ పర్మినెంట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు రోజుల తరబడి విధులు బహిష్కరించారు. రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. అయినా సర్కారు పట్టించుకోలేదు. మంగళవారం రాంకీ సంస్థ కేవలం ఐదు గంటల పాటు చెత్త రవాణను నిలిపేస్తే ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి రూ.40 కోట్లు ఆగమేఘాల మీద చెల్లించడం విస్మయానికి గురి చేస్తున్నదని పలువురు పేర్కొంటున్నారు.
జీహెచ్ఎంసీలో ఎంతటి ఆర్థిక సంక్షోభం ఉన్నా.. ప్రతి నెలా రాంకీకి, సీఆర్ఎంపీ ఏజెన్సీలకు ముందుగానే బిల్లులు చెల్లించాలని పై స్థాయి నుంచి మౌఖిక ఆదేశాలున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన కార్మికులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు.